What Director Doing With Mahesh

What_Director_Doing_With_Maheshపైన కనిపించే పోస్టర్ ను ఒకసారి జాగ్రత్తగా పరిశీలిస్తే.. అందులో ఏదో ఉంది అనే విషయం చూచాయగా అనుమానపెడుతుంది. ఆ పోస్టర్ లో ఉన్న యువకుడు మురారి వాల్ పోస్టర్ ను దీక్షగా చూస్తున్నాడు. ఎంత దీక్షగా అంటే.. గ్రద్ద అతని ఫై వాలి పొడుచుకు తింటున్న పట్టించుకోనంత దీక్షగా!. అందుకు కారణం సినిమా పై ఆ కుర్రాడికి ఉన్న మొండి ప్రేమ అని చెబుతున్నాడు కొత్త దర్శకుడు సాగారెడ్డి. ఆయనే హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘డైరెక్టర్’. ఆ సినిమాలో కధానాయకుడి తత్వానికి నిదర్శనమే ఈ పోస్టర్ అని వివరిస్తున్నారు సాగారెడ్డి.    ఆ సంగతి పక్కన పెడితే తెలుగుకు సంబంధించి చాలామంది హీరోలు ఉండగా మహేష్ సినిమానే ఆ యువకుడు ఎందుకు చూస్తున్నాడు? అలానే మహేష్ బాబువి చాలా సినిమాలు ఉండగా మురారి సినిమా పైనే ఎందుకు మమకారంతో ఉన్నాడు? అంటే.. అందుకు చాలా ప్రత్యేకమైన కారణం ఉంది అంటున్నాడు సాగారెడ్డి. మురారి సినిమాకు, మహేష్ బాబు కు ఈ సినిమా కధకు ఒక సంబంధం ఉంది. కాని అదేంటో.. సినిమాలోనే చూసి తెలుసుకోవాలి అంటున్నాడు ఈ నవ దర్శకతరంగం. మురారి సినిమాకు, సినిమాలోని దర్శకుడికి ఉన్న సంబంధం తప్పకుండా ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది అని మాత్రం హింట్ ఇస్తున్నాడు.    ఈ మధ్య చాలా మంది విషయం ఉన్నా, లేకపోయినా ప్రచారం కోసం మహేష్ పేరు, పవన్ పేరు బాగా వాడేసుకుంటున్నారు. కాని తనది ఆ పంధా కాదని, కధ అవసరాన్ని బట్టి నిజాయితీగా మహేష్ పేరు వాడటం జరిగిందని, ఆ విషయం సినిమా చూస్తే తెలుస్తుందని నమ్మకంగా చెబుతున్నారు సాగారెడ్డి.  చూద్దాం.. అసలు ఈ ‘డైరెక్టర్’ కు మహేష్ బాబుతో పనేంటి? పొతే ఈ డైరెక్టర్ చిత్రం మార్చి 28 న విడుదలకు సిద్దంగా ఉంది.

1 comment: